తరుణ్ భాస్కర్ వల్లే ఛాన్స్ వచ్చిందంటున్న రఘు దీక్షిత్


music director raghu diksheeth about manchu laxmis wife of ram

దర్శకులు తరుణ్ భాస్కర్ వల్లే తెలుగులో నాకు సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందని అంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకులు రఘు దీక్షిత్ . బాలీవుడ్ చిత్రాలతో పాటుగా కన్నడ , తమిళ చిత్ర పరిశ్రమకు సుపరిచితుడే ఈ రఘు దీక్షిత్ అయితే తెలుగులో మాత్రం మొదటిసారిగా ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రంతో అడుగుపెడుతున్నాడు . మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలను వెల్లడించడానికి మీడియా ముందుకు వచ్చాడు సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ .

తరుణ్ భాస్కర్ తో నాకున్న కాస్త పరిచయం తో ఈ చిత్ర దర్శకుడు విజయ్ నాకు పరిచయమయ్యాడు . తరుణ్ – విజయ్ లు కామన్ ఫ్రెండ్స్ దాంతో విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ ” వైఫ్ ఆఫ్ రామ్ ” చిత్రానికి సంగీతం అందించమని కోరారు అంతేకాదు ఈ చిత్రంలో అసలు పాటలు ఉండవని షాకిచ్చాడు ,దాంతో ఛాలెంజ్ గా భావించి ఈ సినిమా చేశాను . వైఫ్ ఆఫ్ రామ్ చిత్రానికి నేపథ్య సంగీతం హైలెట్ కానుంది .

వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చూసాను , తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుంది . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది . మంచు లక్ష్మి నటన , విజయ్ టేకింగ్ వెరసి వైఫ్ ఆఫ్ రామ్ డిఫరెంట్ మూవీ అని అంటున్నాడు రఘు దీక్షిత్ .