సుకుమార్, బన్నీ సినిమా ఆగిపోలేదు.. ఇదిగో సాక్ష్యం


Allu Arjun And Sukumar
సుకుమార్, బన్నీ సినిమా ఆగిపోలేదు.. ఇదిగో సాక్ష్యం

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. మధ్యలో మహేష్ తో సినిమా అనుకున్నా అది క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పట్టాలెక్కలేదు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఇంతవరకూ బానే ఉన్నా గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సినిమా ఆగిపోయిందని, బన్నీ కూడా సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చాడన్నది ఆ పుకార్ల సారాంశం. అయితే ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. ఇప్పుడు సుకుమార్ చెన్నైలో బన్నీ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడట. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్లను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయంటే ఇక ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లే కదా. సో, ఆర్య, ఆర్య 2 తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్నమాట.