వెన్నులో వణుకు పుట్టించే హేజా విడుదలకు సిద్ధం



వెన్నులో వణుకు పుట్టించే హేజా విడుదలకు సిద్ధం
వెన్నులో వణుకు పుట్టించే హేజా విడుదలకు సిద్ధం

పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మున్నా కాశి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హేజా. హారర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. హారర్ లోనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన హేజా, టీజర్ చూస్తేనే ఒళ్లు జలదరించడం ఖాయం. అలాంటి హేజా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో మున్నా కాశి ప్రధాన పాత్రలో నటిస్తుండగా ముమైత్ ఖాన్,తనికెళ్ళ భరణి, నూతన్ నాయుడు, లిజ్యి గోపాల్, లక్ష్మణ్, భూషణ్ ప్రీతి నిగమ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హేజాలో సంగీతం కూడా ప్రధాన భూమిక పోషించనుంది. అందుకే దీన్ని మ్యూజికల్ హారర్ గా ప్రమోట్ చేస్తున్నారు.

టీజర్ చూసిన ఎవరికైనా బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ వల్ల కూడా భయం పుట్టడం ఖాయం. మున్నా కాశి స్వయంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అవ్వడం వల్ల సౌండ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా హారర్ సినిమాల్లో చూపించే సౌండ్స్ కాకుండా కొత్త పంథాలో మున్నా కాశి ఈ చిత్రంలో మ్యూజిక్ ను వాడటం జరిగింది. మున్నా కాశి గతంలో యాక్షన్ 3డి, చిత్రం చెప్పిన కథ, అమ్మ నాన్న ఊరెళితే, కిల్లింగ్ వీరప్పన్ వంటి సినిమాలకు సంగీతం అందించాడు.

హేజా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. సినిమా మొదటినుండి చివరి వరకూ వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్నారు. మరి హేజా టీజర్ నెలకొల్పిన అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 12 వరకూ ఆగాల్సిందే.