మొత్తానికి ప‌వ‌న్ డేట్స్ ప‌ట్టేశాడు!


మొత్తానికి ప‌వ‌న్ డేట్స్ ప‌ట్టేశాడు!
మొత్తానికి ప‌వ‌న్ డేట్స్ ప‌ట్టేశాడు!

పొలిటిక‌ల్ లీడ‌ర్ అయిపోవాల‌ని కాంగ్రెస్ బాట ప‌ట్టిన బండ్ల గ‌ణేష్ త‌న ప్ర‌య‌త్నాలు దారుణంగా విఫ‌లం కావ‌డంతో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రీఎంట్రీకి మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని ఎంచుకున్నారు. బ్లేడ్ బ్యాచ్ అంటూ చేసిన కామెడీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో హ‌ర్ట్ అయిన ఆయ‌న అన‌వ‌స‌రంగా ఈ మూవీలో చేశానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

ఇక అక్క‌డి నుంచి మ‌ళ్లీ నిర్మాత‌గా భారీ చిత్రం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అప‌ర భ‌క్తుడు అన్న విష‌యం తెలిసిందే. ఆ భ‌క్తితో ప‌వ‌న్ హీరోగా తీన్ మాన్, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి హిట్ చిత్రాల్ని అందించారు. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి ప‌వన్‌తో క‌లిసి సినిమా చేయాల‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.  ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం అవుతూ వ‌స్తున్నాయి. అయితే తాజాగా ఆయ‌న పంట పండింది. మొత్తానికి పవ‌న్ ఫైన‌ల్‌గా ఓకే చెప్పేశార‌ట‌. ‌

ఇదే విష‌యాన్ని బండ్ల గ‌ణేష్ సోష్ మీడియా వేదిక‌గా సోమ‌వారం వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  మా బాస్ ఓకే చెప్పేశారు. మ‌రోసారి నా క‌ల నిజం కాబోతోంది. థ్యాంక్యూ మై గాడ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌` అని బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేశారు. దీంతో బండ్ల‌తో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమా 30వ చిత్రంమేని ఫైన‌ల్‌గా క్లారిటీ వ‌చ్చేసింది. అయితే దీనికి దర్శకుడు ఎవరు? ఎప్పుడు లాంచ్ చేస్తారు? వ‌ంటి స‌మాధానాల కోసం మ‌రో ఏడాది ఆగాల్సిందే అని తెలుస్తోంది.