నా విజయం వెనుక నా భార్య కృషి ఎంతో వుంది!!


Akshay Kumar
Akshay Kumar and Twinkle Khanna

డిఫరెంట్ కథా చిత్రాల్లో నటిస్తూ సూపర్ హిట్స్ సాధిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ప్రస్తుతం అక్షయ్‌ ‘మిషన్‌ మంగళ్‌’ ‘సూర్యవంశీ’, ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా తన భార్య ట్వింకిల్ ఖన్నా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో తన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఎంతో సాయం చేసింది.

గత కొన్నాళ్లుగా అక్షయ్‌ జోరుగా విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తున్నారు. ఇదెలా సాధ్యం? అని ఓ ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నించగా.. నా భార్య ట్వింకిల్‌ సపోర్ట్ లేకుండా ఇంత సాధించేవాడిని కాదని . . ‘నా కెరీర్‌లో నాకు ఎంతో సాయం చేసింది ఎవరంటే నా భార్యా ట్వింకిల్ కన్నానే.

నేను ఎంచుకునే ప్రతి స్క్రిప్ట్‌ను నా భార్యతో చర్చించి నేను ఓకే చేస్తాను. కానీ ఆమె నేను ఒప్పుకొనే ప్రతి సినిమా గురించి నాతో చర్చిస్తుంది. తొందరపడి స్క్రిప్ట్‌లు ఎంచుకోకు, నచ్చితేనే ఓకే చెప్పు అని సలహాలు ఇస్తుంది. అందుకే షూటింగ్‌ల కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా నా భార్య ఏమీ అనుకోదు. పిల్లలకు నేను లేని లోటు తెలీనివ్వదు’ అని వెల్లడించారు స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ !!