ద‌ర్శ‌కుడు ఔట్‌.. రంగంలో దిగిన‌ హీరో విశాల్‌?


 

Mysskin backing away from Thupparivaalan sequel
Mysskin backing away from Thupparivaalan sequel

విశాల్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం `తుప్ప‌రివాల‌న్‌`. ద‌ర్శ‌కుడు మిస్కిన్ ఈ చిత్రాన్ని అత్యంత స‌హ‌జ‌త్వంగా తెర‌కెక్కించారు. తెలుగులో `డిటెక్టివ్‌` పేరుతో రిలీజ్ అయినా ఈ చిత్రం రెండు భాష‌ల్లోనూ మంచి విజ‌యాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ని మొద‌లుపెట్టారు. తొలి భాగానికి ప‌నిచేసిన వారే ఈ చిత్రంలోనూ న‌టిస్తున్నారు. విశాల్ హీరో. త‌నే న‌టిస్తూ ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ పై నిర్మిస్తున్నాడు.

కొంత వ‌ర‌కు లండ‌న్‌లో షూటింగ్ జ‌రిగింది. అయితే ఈ సినిమా నుంచి ద‌ర్శ‌కుడు అర్థాంత‌రంగా త‌ప్పుకోవ‌డం కోలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. ముందు ఈ చిత్రం కోసం 40 కోట్ల బ‌డ్జెట్‌ని ద‌ర్శ‌కుడు మిస్కిన్ అడిగార‌ట‌. దానికి విశాల్ ఎంత మాత్ర‌ము అంగీక‌రించ‌లేద‌ని, దీంతో చాలా రోజులుగా వీరి మ‌ధ్య వాద‌న‌లు జ‌రుగుతూనే వున్నాయ‌ని, తాజాగా అవి పీక్స్‌కి చేరుకోవ‌డంతో మిస్కిన్ సీక్వెల్‌ని మ‌ధ్య‌లోనే వ‌దిలేసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడ‌ని తెలిసింది.

అయితే ఈ వివాదంపై ఇందులో న‌టిస్తున్న ప్ర‌స‌న్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. లండ‌న్‌లో షూటింగ్ చేస్తున్నాం. అక్క‌డి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో కీల‌క పాత్ర‌ల‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయించ‌ల‌ని మిస్కిన్ ప‌ట్టుబ‌ట్టాడ‌న‌. ఆ విష‌యంతో పాటు బ‌డ్జెట్ విష‌యంలో విశాల్‌కు మిస్కిన్‌కు మ‌ధ్య అభిప్రాయ భేధాలు త‌లెత్తాయ‌ని వెల్ల‌డించారు. మ‌ధ్య‌లో మిస్కిన్ వ‌దిలేసిన ఈ చిత్రాన్ని హీరో విశాల్ ద‌ర్శ‌కుడిగా పూర్తి చేయ‌బోతున్నాడ‌ని కోలీవుడ్‌లో వినిపిస్తోంది.