ప్ర‌భాస్‌తో మైత్రీ మూవీమేక‌ర్స్ బిగ్ డీల్‌?


ప్ర‌భాస్‌తో మైత్రీ మూవీమేక‌ర్స్ బిగ్ డీల్‌?
ప్ర‌భాస్‌తో మైత్రీ మూవీమేక‌ర్స్ బిగ్ డీల్‌?

`బాహుబ‌లి` చిత్రంతో ప్ర‌భాస్ క్రేజ్ స్కై హైకి చేరింది. ఈ సినిమా కార‌ణంగా ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన `సాహో` ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. పెట్టిన పెట్టుబ‌డిని కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. అయితే ప్ర‌భాస్‌కు `బాహుబ‌లి`తో వ‌చ్చిన క్రేజ్‌ని ఏమాత్రం త‌గ్గించ‌లేక‌పోయింది. ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ `జాన్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. `సాహో` ఫ‌లితం తారుమారు కావ‌డంతో `జాన్‌` క‌థ‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని తెలిసింది.

ఇదిలా వుండ‌గా ప్ర‌భాస్‌తో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీమేక‌ర్స్ బిగ్ డీల్‌ని కుదుర్చుకున్న‌ట్టు తాజా స‌మాచారం. త్వ‌ర‌లో ప్ర‌భాస్‌తో ఓ భారీ సినిమాని తెర‌పైకి తీసుకురావ‌డం కోసం ప్ర‌భాస్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నార‌ట‌. ఇందులో భాగంగా ప్ర‌భాస్‌కు అడ్వాన్స్‌గా 13 కోట్ల చెక్‌ను ఇచ్చార‌ని తెలిసింది. త‌మ సంస్థ నిర్మించ‌బోయే చిత్రానికి గానూ ప్ర‌భాస్‌కు రెమ్యున‌రేష‌న్ కింది 30 కోట్లు ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు ముందే 5 కోట్ల చెక్‌ని అంద‌జేసిన మైత్రీ మేక‌ర్స్ తాజాగా మ‌రో 8 కోట్లని అంద‌జేసిన‌ట్లు స‌మాచారం.

`బాహుబ‌లి`కి ప్ర‌భాస్ 25 కోట్లు తీసుకున్నార‌ట‌. ఆ సినిమాకు మించి ఈ సారి 30 కోట్లు తీసుకుంటుండ‌టం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భాస్ మ‌ధ్య‌లో ఆపేసిన `జాన్` రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది. అవి పూర్త‌యిన త‌రువాతే మైత్రీ మూవీ మేక‌ర్స్ ఫిల్మ్ సెట్స్‌పైకి రానుంద‌ట‌. దీనికి `కేజీఎఫ్` ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తాడా? లేక మ‌ళ్లీ రాజ‌మౌళినే సీన్‌లోకి తీసుకొస్తారా అన్న‌ది తెలియాల్సి వుంది. మైత్రీ ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్‌కి అడ్వాన్స్ ఇచ్చేసి అత‌న్ని లాక్ చేసేసింది.