అల్లు అర్జున్ నిర్ణయంతో మైత్రి అసంతృప్తి?

అల్లు అర్జున్ నిర్ణయంతో మైత్రి అసంతృప్తి?
అల్లు అర్జున్ నిర్ణయంతో మైత్రి అసంతృప్తి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ను మరింత పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. తన ప్రస్తుత సినిమా పుష్పను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాడు. అంతేనా, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా ఖర్చు పెడుతోంది.

ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కు మరింత లావిష్ గా ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మరో నెల రోజుల్లో పూర్తి చేసి పుష్ప సెకండ్ పార్ట్ పనులు మొదలుపెట్టాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప రెండు పార్ట్స్ కు మధ్య మరో సినిమా గ్యాప్ ఉంటే మంచిదని భావిస్తున్నాడు.

అందుకే ఈ గ్యాప్ లో ఐకాన్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం మైత్రి వారికి రుచించట్లేదట. రెండు భాగాలూ వరసగా షూటింగ్ అయిపోతే తమకు ప్రొడక్షన్ ఖర్చులు పెరిగిపోతుందని ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారో ఏమో.