`ఉప్పెన‌` హీరోతో మైత్రీ బిగ్ డీల్?

`ఉప్పెన‌` హీరోతో మైత్రీ బిగ్ డీల్?
`ఉప్పెన‌` హీరోతో మైత్రీ బిగ్ డీల్?

`ఉప్పెన‌` చిత్రంతో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. సానా బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి అనూహ్యంగా వంత కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ మూవీ త‌రువాత వైష్ణ‌వ్ తేజ్ తో క్రిష్ ఓ చిత్రాన్ని ఇప్ప‌టికే పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. `కొండ పొలం` న‌వ‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వున్న ఈమూవీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ఇటీవ‌లే బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ బ్యాన‌ర్‌లో ఓ మూవీని ఇటీవ‌లే లాంఛ‌నంగా ముహూర్తం జ‌రుపుకున్న వైష్ణ‌వ్ తేజ్ మైత్రీ బ్యాన‌ర్‌లో మ‌రో రెండు చిత్రాల‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ట్టు తెలిసింది. ఈ రెండు చిత్రాల‌కు సుకుమార్ స‌హ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌.

త్వ‌ర‌లోనే రెండు క‌థ‌ల్ని సుకుమార్ ఫైన‌ల్ చేయ‌బోతున్నార‌ని, వీటికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానుంద‌ని తెలిసింది. `ఉప్పెన‌` ఊహించ‌ని స్థాయిలో లాభాల్ని తెచ్చిపెట్ట‌డంతో మైత్రీ సంస్థ వైష్ణ‌వ్ తేజ్ తో రెండు ప్రాజెక్ట్‌లని చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.