నా లవ్ స్టోరీ రివ్యూ


naa love story review
నా లవ్ స్టోరీ రివ్యూ:
నటీనటులు :మహీధర్ , సోనాక్షి
సంగీతం : వేద నివాస్
నిర్మాత : లక్ష్మి
దర్శకత్వం : శివ గంగాధర్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 29 జూన్ 2018

మహీధర్ – సోనాక్షి జంటగా శివ గంగాధర్ దర్శకత్వంలో లక్ష్మీ నిర్మించిన చిత్రం ” నా లవ్ స్టోరీ ”. రొమాంటిక్ లవ్ స్టోరీ లకు ఆదరణ లభిస్తుండటంతో అదే జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు . మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే ప్రశాంత్ ( మహీధర్ ) నందిని ( సోనాక్షి ) ని చూసి ప్రేమలో పడతాడు . నందిని కూడా ప్రశాంత్ ని ప్రేమిస్తుంది అయితే అనుకోని కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి వాటిని దాటుకొని పెళ్లి కోసం పెద్దలను ఆశ్రయించగా ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించరు . దాంతో ప్రశాంత్ – నందిని లు తీవ్ర నిర్ణయం తీసుకుంటారు . ప్రశాంత్ – నందిని లు తీసుకున్న తీవ్ర నిర్ణయం ఏంటి ? ఆ నిర్ణయంతో పెద్దలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారా ? దాని కథా కమామీషు ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

మహీధర్ నటన
సోనాక్షి గ్లామర్
శ్రీమన్నారాయణ – తోటపల్లి మధు ల కామెడీ

డ్రా బ్యాక్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

కొత్త కుర్రాడు మహీధర్ ప్రశాంత్ పాత్రలో చక్కగా నటించాడు . కొన్ని కొన్ని సార్లు హీరో ప్రభాస్ ని తలపించాడు . సోనాక్షి గ్లామర్ తో ఆకట్టుకుంది , మహీధర్ – సోనాక్షి ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది . ఇక రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టించారు . ఇక ఈ సినిమాకు హైలెట్ తోటపల్లి మధు – శ్రీమన్నారాయణ ల హాస్య సన్నివేశాలు .

సాంకేతిక వర్గం :

కిరణ్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . నిర్మాత పెట్టిన ఖర్చు ని తెరమీద కనిపించేలా చేసి మ్యాజిక్ చేసాడు . శివశక్తి దత్తా – భువనచంద్ర అందించిన సాహిత్యం బాగుంది అలాగే వేదానివాస్ అందించిన పాటలు బాగున్నాయి , నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి ,ఇక దర్శకుడు శివ గంగాధర్ విషయానికి వస్తే …… యూత్ ని ఆకట్టుకునే అంశాలను కథా వస్తువుగా ఎంచుకొని మంచి ప్రయత్నం చేసాడు . ఇప్పటి వరకు రాని ఆలోచనతో శివ గంగాధర్ సరికొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు .

ఓవరాల్ గా :

యూత్ ని ఆకట్టుకునే ”నా లవ్ స్టోరీ ”

English Title: Naa Love Story Review