2 రోజుల్లో 63 కోట్లు వసూల్ చేసిన నా పేరు సూర్య


Naa Peru Surya naa illu india 2 Days Worldwide box office collectionమొదటి రోజున 40 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రెండోరోజున మరో 23 కోట్లకు పైగా వసూల్ చేసాడు దాంతో రెండు రోజుల్లో 63. 86 కోట్లు రాబట్టాడు అల్లు అర్జున్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజునే మిశ్రమ స్పందన ని పొందింది దాంతో భారీ వసూళ్లు రావడం లేదు . మిలిటరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంతో నటుడిగా అల్లు అర్జున్ ఎంతో ఎత్తకి ఎదిగాడు అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం ఆడటం లేదు .

అల్లు అర్జున్ కున్న క్రేజ్ తో వసూళ్లు వస్తున్నాయి , మరో రెండు రోజుల పాటు మరో సినిమా ఏది లేకపోవడంతో ఈ రెండు రోజులు పాటు మంచి వసూళ్లు రానున్నాయి . మొత్తానికి మొదటి వారంలో వచ్చే వసూళ్లు మాత్రమే ఈ సినిమాకు వచ్చే ఆదాయం , రెండో వారంలో కలెక్షన్లు రావడం కష్టమే ! అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు కానీ సినిమా పట్ల అంత సానుకూలంగా లేరు . 88 కోట్ల బిజినెస్ జరిగింది నా పేరు సూర్య నా ఇల్లు నా ఇండియా బయ్యర్లు సేఫ్ కావాలంటే మరో 80 కోట్లు వసూల్ కావాలి .