నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ డే కలెక్షన్లు


naa peru surya naa illu india first day collections

అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే . అసలే ఎండాకాలం ఆపై అల్లు అర్జున్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి . దాంతో మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ సంగీతం అందించారు .

 

అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పరవశించిపోతున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మలయాళంలో తమిళ్ లో అలాగే ఓవర్ సీస్ లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం 35 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి మొదటి రోజున అయితే ఈ లెక్కలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా రెస్ట్ ఆఫ్ వరల్డ్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లెక్కలు పూర్తిస్థాయిలో రావాలి కాబట్టి . 35 నుండి 45 కోట్ల మధ్య ఈ లెక్కలు ఉండొచ్చు అని తెలుస్తోంది . మలయాళంలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ వచ్చే ఆదాయం కూడా అదనమే ! ఓవరాల్ గా 35 కోట్ల పైచిలుకు మొత్తాన్ని మొదటి రోజున అందుకున్నాడు అల్లు అర్జున్ .