నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి స్పెషల్ షోలు


Naa Peru Surya naa illu india  gets permission for  special shows across Andhra Pradesh and Telangana
అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి లభించింది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు తెల్లవారు ఝామున 5 గంటలకు స్పెషల్ షో ప్రారంభం కానుంది . వేసవి సెలవులు అందునా భారీ ఎండలు ఉండటంతో స్పెషల్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది . ఈ స్పెషల్ షోలు మే 4 నుండి 11 వ తేదీ వరకు వేయనున్నారు , మే 4 న ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతాయి . కొన్ని చోట్ల 7 గంటలకు ప్రారంభం కానున్నాయి మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అల్లు అర్జున్ చిత్రానికి మరిన్ని వసూళ్లు అదనంగా లభించనున్నాయి .
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చరణ్ . దాంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు . లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది . మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పై అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .