నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ట్రైలర్ టాక్


naa peru surya naa illu india trailer talk

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం మే 4న విడుదల కానుండగా ఈరోజు థియేట్రికల్ ట్రయిలర్ ని విడుదల చేసారు , ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ……. ఒక్క మాటలో చెప్పాలంటే నా పేరు సూర్య చిత్రంపై అంచనాలు పెంచేలాగే ఉంది . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ – నాగబాబు లు సంయుక్తంగా నిర్మించారు . అల్లు అర్జున్ సైనికుడి గా నటించిన ఈ చిత్రంపై అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ……. పూర్తి యాక్షన్ తో రూపొందింది . మాస్ ప్రేక్షకులకు ఇది నచ్చేలా ఉంది కూడా అయితే లోపాయికారిగా తెలుస్తున్న దాని ప్రకారం బయట కనబడుతున్న విజువల్స్ ని చూస్తే ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” చాలా సీరియస్ గా సాగె సినిమా అని అనుకునేలా ఉంది కానీ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కూడా పుష్కలంగా ఉంటుందట . మిలిటరీ లో అల్లు అర్జున్ చేరడానికి గ్రామంలోని వాళ్ళ చేత అంగీకార పత్రం తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతాడట ! ఆ సమయంలో ఫన్ జనరేట్ అవుతుందని అంటున్నారు . అసలు అయితే ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే మే 4 వరకు ఎదురు చూడాల్సిందే .