నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ రేటింగ్


Naa Peru Surya Umair Sandhu Review and Rating

అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఈరోజు రాత్రికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడనున్నాయి ఓవర్ సీస్ లో . ఇక ఈ సినిమా విడుదల కాకుండానే ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు అలాగే రేటింగ్ కూడా ఇచ్చాడు . ఇంతకీ ఉమైర్ సందు నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. …. 3. 5/ 5.

అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడని , టెర్రిఫిక్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకున్నాడని ….. వక్కంతం వంశీ డైరెక్షన్ , రాకింగ్ మ్యూజిక్ వెరసి నాపేరు సూర్య నాయిల్లు ఇండియా చిత్రానికి 3. 5/ 5 రేటింగ్ ఇస్తున్నానని వెంటనే వెళ్లి తప్పకుండా సినిమా చూడండి అంటూ ట్వీట్ చేసాడు ఉమైర్ సందు . అంతేకాదు అల్లు అర్జున్ అందరి మనసు దొంగిలించేసాడని కూడా ట్వీట్ చేసాడు ఉమైర్ సందు . యూకే అండ్ యుఏ ఈ సెన్సార్ సభ్యుడు కూడా అయినందున సినిమాని ముందుగానే చూసి రివ్యూ ఇస్తుంటాడు ఉమైర్ సందు . మొత్తానికి అల్లు అర్జున్ చిత్రానికి 3. 5 రేటింగ్ ఇచ్చాడంటే అసలు విషయం ఏంటన్నది రేపు తేలనుంది .