“నా వల్ల కాదే…!” అంటున్నఆకాష్ పూరీ


Naa Valla Kadhe song from Romantic Movie
Naa Valla Kadhe song from Romantic Movie

కళ్ల నుంచి నీరు లాగా నువ్వు జారగా…

కాళ్ల కింద భూమి జారినట్టు ఉందిగా…

నువ్వే నేననేంత స్వార్థం కదా

నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా

నీ ధ్యాసనాపడం

నా స్వాసనాపడం రెండొక్కటే కదా…

పాట అంటే కేవలం మనం పడుకుని నిద్ర రావడం కోసం పాడుకునేదో, వినేదో కాదు. మన నిద్రను పాడు చేసి, మనల్ని ఆడుకునేది, మన జీవితంలో జరిగిన సంఘటనలను కూడా వాడుకున్నట్లు మనకు అనిపించేది. ఇప్పుడు ఇదంతా గురు గారు పూరీ గారి అబ్బాయి జూనియర్ పూరీ కొత్త సినిమా రొమాంటిక్ సినిమాలో రిలీజ్ అయిన “నా వల్ల కాదే.” అనే పాట కనెక్ట్ అయిన హైలో రాస్తున్న వర్ణన.

ఈ సినిమాకి సంగీతం సునీల్ కాశ్యప్ గారు. సునీల్ & పూరీ కాంబినేషన్ లో ఇప్పటికే జ్యోతి లక్ష్మి, లోఫర్, రోగ్ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో ఇది రెండో పాట. ఇక పూరీ గారు బిర్యానీ అయితే మసాలా లాగా అంటిపెట్టుకుని ఉండే భాస్కరభట్ల గారు ఈ పాటను రాసారు. పాట గురించి విశ్లేషణ కన్నా, పాటలో అందరికీ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ముందే అనుకోవడం జరిగింది.

సినిమా ఎలా ఉన్నా, ఈ సినిమాలో ప్రేమ గురించి పూరీ సర్ డిస్కస్ చేసే ఒక ఫిలాసఫీ గురించి అందరూ వెయిటింగ్. కేతిక శర్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు పూరీ సర్ శిష్యుడు అయిన అనిల్ పదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.