జూన్ 30న అల్ల‌రి న‌రేష్‌పై ఎఫ్ ఐ ఆర్‌!



జూన్ 30న అల్ల‌రి న‌రేష్‌పై ఎఫ్ ఐ ఆర్‌!
జూన్ 30న అల్ల‌రి న‌రేష్‌పై ఎఫ్ ఐ ఆర్‌!

జూన్ 30న హీరో అల్ల‌రి న‌రేష్‌పై ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట‌ర్ చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. వివారాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా త‌న మార్కు చిత్రాల‌తో ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు అల్ల‌రి న‌రేష్. దీంతో తొలి సారి త‌న పంథాకు భిన్నంగా ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నారు. `నాంది` పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. తొలిసారి అత్యంత స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా అల్ల‌రి న‌రేష్ త‌న పంథాకు పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు.

హ‌రీష్ శంక‌ర్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో కో- డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభానికి ముందే ఈ చిత్ర షూటింగ్ 80 శాతం పూర్త‌యింది. సినిమాలోని పోలీస్ స్టేష‌న్ స‌న్నివేశంలో హీరో అల్ల‌రి న‌రేష్ అర్థ‌న‌గ్నంగా క‌నిపించ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన లుక్‌ని జూన్ 30న అల్ల‌రి న‌రేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  `నాంది ఎఫ్ ఐ ఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నారు. పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా కూర్చుని వున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. `నేను` చిత్రం త‌రువాత అల్ల‌రి న‌రేష్ న‌ట విశ్వ‌రూపం చూపించ‌నున్న సినిమా ఇదే కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.