థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా…


థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా...
థాయిలాండ్ లో థ్రిల్లింగ్ గా…

దర్శకుడు “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” గారు సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడతారు. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది తెలుగు సినిమా చరిత్రలో. ఇప్పుడు ఇద్దరు హీరో, హీరోయిన్ లతో చేస్తున్న “వి” సినిమా రోజు రోజుకి జనాల మీద ఆసక్తి వచ్చేలా చేస్తుంది.

నాచురల్ స్టార్ ‘నాని’ ప్రతి నాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో…సుధీర్ బాబు హీరో. అదితి రావు హైదరి, నివేద థామస్ కథానాయికలు. దిల్ రాజు గారు వాళ్ళ సోదరులతో కలిసి ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై భారీగా నిర్మిస్తున్నారు. మొదటి సారి నాని ప్రతినాయకుడి గా నటిస్తున్నాడు అంటేనే సినిమా కథ మీద, ఆ పాత్ర మీద నానికి ఎంత నమ్మకం ఉంటే ఒప్పుకుంటారు చెప్పండి. అలాగే ఇది వరకు తన కెరీర్ లో 2 బెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా మూడవ సారి ఆ దర్శకుడుని నమ్మి వేస్తున్న అడుగు కాబట్టి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే సినిమా ఇప్పుడు దక్షిణ తీరం థాయిలాండ్ ‘ఫుకెట్’ దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది అని కథానాయకుడు సుధీర్ బాబు గారు తన టీం తో ఉన్న వీడియో ఒకటి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మనతో పంచుకున్నారు. అయితే 2 రోజుల క్రితమే వెన్నల కిషోర్ గారు కూడా సినిమాలో భాగం అయ్యి తాను కూడా ఒక వీడియో పోస్ట్ చేసారు.

అయితే సుధీర్ బాబు, వెన్నెల కిషోర్ గారు షేర్ చేసిన వీడియోలు చూస్తే సినిమా సముద్ర భాగం మధ్య లో జరిగే సన్నివేశాలు అని అర్ధం అవుతుంది. దర్శకులు మోహన కృష్ణ గారు కూడా ఈ వీడియో లో ఉన్నారు. మరి ఆ వీడియో సినిమాలో జరిగే సన్నివేశం అప్పుడు తీసిందా? లేక వాళ్లు కాలీ సమయంలో గడుపుతున్నపటి వీడియోనా? అని అర్ధం కాకుండా ఉంది. జనరల్ గా ఇలాంటి వీడియో లు ఎవరన్నా పంచుకుంటే ఇలాంటి సందేహాలు రావడం సర్వ సాధారం కానీ ఈ వీడియో లో దర్శకులు కూడా ఉండే సరికి సందేహం ఇంకా ఎక్కువ అవుతుంది.

సుధీర్ బాబు గారు ట్వీట్ లో “మా సినిమా ‘వి’ గేలరీ లో నుండి వెన్నెల కిషోర్ గారితో ముందు జరిగే అడ్వెంచర్ సీన్ కోసం షెడ్యూల్ జరుగుతుంది. మేము బాగా ఆ అడ్వెంచర్ సీన్స్ రావాలి అని, అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము” అని అన్నారు. మరి దీంట్లో అర్ధం చేసుకుంటే సినిమా సీన్ కోసం జరుగుతున్నది అని ఇట్టే అనిపిస్తుంది కదా. మరి ఇకనైనా దర్శకులు ఇలాంటి ముఖ్యమైన సీన్స్ షూట్ జరిగేటప్పుడు లీక్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది అని జనాలు అనుకుంటున్నారు.

Credit: Twitter