త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో వెంకీ హ‌ల్‌చ‌ల్‌!


త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో వెంకీ హ‌ల్‌చ‌ల్‌!
త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో వెంకీ హ‌ల్‌చ‌ల్‌!

ఎఫ్‌2, వెంకీమామ వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విక్ట‌రీ వెంక‌టేష్ కొంత విరామం త‌రువాత సోలో హీరోగా న‌టిస్తున్న చిత్రం `నార‌ప్ప‌`. త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ ఇస్తున్నారు. వెంకీ న‌టిస్తున్న‌ 74వ చిత్రం కావ‌డంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్తిస్తున్నారు. ఇటీవ‌లే అనంత‌పురం జిల్లా ఉన‌వ‌కొండ‌లోని పాల్తూరు గ్రామంలో ప్రారంభ‌మైంది.

శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యార్‌పై సురేష్‌బాబు, క‌లైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ల‌కు విశేష స్పంద‌న ల‌భించింది. దీంతో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో జ‌రుగుతోంది. పీట‌ర్ హెయిన్స్ నేతృత్వంలో నార‌ప్ప‌కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తియిన త‌రువాత వెంక‌టేష్‌తో పాటు చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన‌గా కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తార‌ట‌. ఆ స‌న్నివేశాల్ని అనంత‌పురంలో షూట్ చేస్తార‌ని చిత్ర బృందం వెల్ల‌డించింది. స‌మ్మ‌ర్ కి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట‌.