నారప్ప ప్రీమియర్ కు సర్వం సిద్ధం

నారప్ప ప్రీమియర్ కు సర్వం సిద్ధం
నారప్ప ప్రీమియర్ కు సర్వం సిద్ధం

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప విడుదలకు సిద్ధమైంది. ఇవి అసాధారణ రోజులు. ప్యాండెమిక్ తో మన పోరాటం ఏడాదిన్నరగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోవడం, ప్రేక్షకులు థియేటర్లకు రావడంపై అనిశ్చితి నెలకొంది. దీంతో కొంత మంది నిర్మాతలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఓటు వేశారు.

ఈ కోవలో వెంకటేష్ నటించిన నారప్ప విడుదలకు సిద్ధమైంది. ఈరోజు రాత్రి 10 గంటల నుండి నారప్ప అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ భార్యగా నటించింది.

నారప్ప ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో నారప్ప ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించగా మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.