తెరికాడు రెడ్ డిసెర్ట్‌లో `నార‌ప్ప` హంగామా!



తెరికాడు రెడ్ డిసెర్ట్‌లో `నార‌ప్ప` హంగామా!
తెరికాడు రెడ్ డిసెర్ట్‌లో `నార‌ప్ప` హంగామా!

ధ‌నుష్ హీరోగా న‌టించిన సంచ‌ల‌న చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి వ‌సూళ్ల‌ని కూడా రాబ‌ట్టింది. ధ‌నుష్ కెరీర్‌లోనే అత్యుత్త‌మ న‌ట‌న ప్ర‌ద‌ర్శించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ చేస్తున్న విసయం తెలిసిందే. విక్ట‌ర వెంక‌టేష్ హీరోగా క‌లైపులి ఎస్‌.థాను స‌మ‌ర్ప‌ణ‌లో డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు.

ప్రియ‌మ‌ణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వెంక‌టేష్ ఇందులో రెండు భిన్న‌మైన షేడ్స్ వున్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా, యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రం కోసం త‌మిళ‌నాడులోని తెరికాడ్ రెడ్ డీసెర్ట్‌లో ప‌లు కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. 10 రోజుల పాటు చిత్రీక‌రించిన ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌కు పీట‌ర్ హెయిన్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమాలో ఈ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర బృందం చెబుతోంది.

ఇప్ప‌టికే 27 రోజుల పాటు చిత్రీర‌క‌ర‌ణ పూర్త‌యింది. ఇక్క‌డే నాన్ స్టాప్‌గా షెడ్యూల్ వుంటుంద‌ని, ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేస్తామ‌ని చిత్ర బృందం వెల్ల‌డించింది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిటిర్‌గా ప‌నిచేస్తున్నారు. స‌మ్మ‌ర్‌కి చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.