దృశ్యం2 కన్నా నారప్పే ముందు!

దృశ్యం2 కన్నా నారప్పే ముందు!
దృశ్యం2 కన్నా నారప్పే ముందు!

విక్టరీ వెంకటేష్ రెండు సినిమాలను పూర్తి చేసాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే జెట్ స్పీడ్ లో మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన దృశ్యం 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేసాడు.

ఈ రెండు సినిమాల్లో ముందుగా దృశ్యం2 ను విడుదల చేయాలనుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి అప్పుడే డీల్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు విడుదల తేదీలలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.

జులై నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో థియేటర్లు తెరుచుకోనున్నాయి. టాలీవుడ్ కూడా సినిమా రిలీజ్ లను లైనప్ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో నారప్ప కూడా జులై మూడు లేదా ఆఖరి వారంలో విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత రెండు నెలలకు దృశ్యం2 అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది.