మెగా హీరో సినిమాను వదులుకున్న మహేష్ హీరోయిన్


మెగా హీరో సినిమాను వదులుకున్న మహేష్ హీరోయిన్
మెగా హీరో సినిమాను వదులుకున్న మహేష్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ సినిమాలో చాలా పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించి అలరించింది. అయితే అనుకున్నంత పద్దతి కియారా కాదని లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో ఆమె వేసిన బోల్డ్ పాత్ర చూస్తే తెలిసిపోతుంది. అయితే భరత్ అనే నేను సినిమా విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం సంపాదించింది కియారా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమై దారుణంగా పల్టీ కొట్టింది. మరోవైపు కియారా బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ఆమె నటించిన కబీర్ సింగ్ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు అక్కడ అవకాశాలు క్యూ కట్టాయి. అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరిగినా సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది కియారా.

కానీ ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమాలో అవకాశం వస్తే మాత్రం చేజార్చుకుంది. వరుణ్ తేజ్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వరుణ్, గద్దలకొండ గణేష్ సినిమాతో తనలోని మరో కోణాన్ని కూడా పరిచయం చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తర్వాతి చిత్రానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఈ చిత్రముంది. అల్లు అరవింద పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రం ద్వారానే పూర్తి స్థాయిలో నిర్మాణంలోకి దిగుతున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కియారాను సంప్రదిస్తే డేట్లు ఖాళీ లేవని చెప్పడంతో కొంతకాలం ఆగుతాం అని నిర్మాతలు తొలుత అన్నారట. అయితే వరుణ్ తేజ్ అందుకు నిరాకరించడంతో అదే విషయం కియారాకు చెబితే తాను చేయలేనని, ముందే కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేసానని చెప్పింది. దాంతో ఇప్పుడు కియారా స్థానంలో మరొక హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ తో ఒక ఊపు ఊపిన నభ నటేష్ లేదా నిధి అగర్వాల్ లో ఒకర్ని ఈ సినిమా కోసం సంప్రదించనున్నారని తెలుస్తోంది. మరి వీరిలో ఈ సినిమా చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.

ఇస్మార్ట్ శంకర్ అఖండ విజయం సాధించడంతో ఈ ఇద్దరు భామలకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. నభ నటేష్ ఇప్పటికే రవితేజ సరసన డిస్కో రాజా చేస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో కూడా నభ నటిస్తోంది. నిధి అగర్వాల్ కూడా అశోక్ గల్లా డెబ్యూ ప్రాజెక్ట్ లో సెలక్ట్ అయింది.