ఇస్మార్ట్ పిల్లతో రౌడీ రొమాన్స్


Nabha Natesh
ఇస్మార్ట్ పిల్లతో రౌడీ రొమాన్స్

చాలా ప్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకొచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో అదే ఉత్సాహంతో తన తర్వాత సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.

ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తవ్వగానే ఈ చిత్రం మొదలవుతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ లో అటు గ్లామర్ లో, ఇటు నటనలో మంచి మార్కులు వేయించుకున్న నభా నటేష్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు వినికిడి.

చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ అనే ముద్ర నభా నటేష్ పై పడింది. దీనికి తోడు గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకుని నటించదు కాబట్టి ఈమెకు డిమాండ్ కూడా పెరిగింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఫుల్ బిజీగా ఉంది నభా.