ఎన్టీఆర్ మహానాయకుడు పై నాదెండ్ల ఆగ్రహం


Nadendla Bhaskar rao fires on NTR biopic makers

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కర్ రావు అని స్పష్టంగా చూపించారు . అంతేకాదు కేంద్రంలోని ఇందిరమ్మ మద్దతుతోనే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసినట్లు చూపించారు దాంతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు .

 

చంద్రబాబు నాయుడు ని హీరోగా చూపించడం కోసం నన్ను విలన్ గా చూపిస్తారా ? అసలు నిజం ఏంటి ? అన్నది తెలుగు ప్రజలందరికి తెలుసనీ , ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్న సమయం కాబట్టి నన్ను విలన్ గా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసాడు నాదెండ్ల భాస్కర్ రావు . ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేసింది నేను అన్నం పెట్టిన నాకు సున్నం పెడతారా ? అంటూ నిప్పులు చెరిగారు నాదెండ్ల .

 

English Title: Nadendla Bhaskar rao fires on NTR biopic makers