జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించిన లీడర్


Nadendla Bhaskar rao sensational comments on Jr. ntr
Nadendla Bhaskar rao sensational comments on Jr. ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అవమానించాడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు . అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదని, అతడి సినిమాలు కూడా నేను ఇంతవరకు చూడలేదని, అలాంటిది తెలుగుదేశం పార్టీ ని అతడికి అప్పగించాలని నేనెలా అంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నాదెండ్ల భాస్కర్ రావు . తెలుగునాట స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ దశాబ్దానికి పైగా స్టార్ గా చెలామణి అవుతున్నాడు .

అలాంటి ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అని కామెంట్ చేయడం అంటే ఎన్టీఆర్ ని ఘోరంగా అవమానించినట్లే ! తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో నాయకత్వ మార్పు గురించి పెద్దగా చర్చ సాగుతోంది . దాంతో తెలుగుదేశం పార్టీ ని నందమూరి కుటుంబ సభ్యులు సొంతం చేసుకుంటారా ? లేదా ? అన్నది వాళ్ళ నిర్ణయమని , ఇక నా కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన లోచేరి పెద్ద తప్పు చేసాడని అంటున్నాడు . ఈ సీనియర్ లీడర్ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం విపరీతంగా బాధపెట్టేవే !