ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ ఇప్ప‌ట్లో కష్ట‌మేనా


ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ ఇప్ప‌ట్లో కష్ట‌మేనా
ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ ఇప్ప‌ట్లో కష్ట‌మేనా

`సాహో` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత ప్ర‌భాస్ ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. కీల‌క షెడ్యూల్‌ని జార్జియాలో పూర్తి చేశారు.

హైద‌రాబాద్‌లో ప్యాలెస్ సెట్‌లో త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ క‌రోనా కార‌ణంగా  షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ఈ  మూవీ త‌రువాత ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ తో ఓ భారీ చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌లో నిర్మించ‌బోతున్నారు.

సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో ప్రారంభించాల‌ని టీమ్ ప్లాన్ చేసింది. కానీ అది క‌రోనా కార‌ణంగా వ‌ర్కవుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో మొద‌లు పెట్టాల‌ని చిత్ర బృందం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. దీని కోసం భారీ సెట్స్‌ని నిర్మించ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఆ త‌రువాతే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తార‌ని తాజా న్యూస్‌.