ప్ర‌భాస్ 21 నుంచి టు అప్‌డేట్స్ రెడీ!


ప్ర‌భాస్ 21 నుంచి టు అప్‌డేట్స్ రెడీ!
ప్ర‌భాస్ 21 నుంచి టు అప్‌డేట్స్ రెడీ!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇటీవ‌లే ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన `స‌లార్‌` చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఇదిలా వుంటే ప్ర‌భాస్ తో బాలీవుడ్ డైరెక్ట‌ర్ రూపొందించ‌బోతున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌`కి సంబంధించిన మోష‌న్ క్యాప్ష‌ర్ వ‌ర్క్ మొద‌లైంది. త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న సైన్స్ ఫిక్ష‌న్ ప్రారంభం కాబోతోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌‌నున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు.

దీపిక ప‌దుకునే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్ ఇంత వ‌ర‌కు రాలేదు. దీంతో ప్ర‌భాస్ అభిమానుల్లో అస‌హ‌నం మొద‌లైంది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ని ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెట్టారు. కొంత మంది సెటైర్లు కూడా వేశారు. దీంతో మొత్తానికి నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ నెల 29న ఓ అప్ డేట్‌ని ఇవ్వ‌బోతున్నాన‌ని, మ‌రో అప్ డేట్‌ని ఫిబ్ర‌వ‌రి 26న చెప్ప‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ డ‌బుల్ స‌ర్‌ప్రైజ్‌కి ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నార‌ట‌.