మీడియాకు క‌రోనా వైర‌స్‌: నాగ‌బాబు?

మీడియాకు క‌రోనా వైర‌స్‌: నాగ‌బాబు?
మీడియాకు క‌రోనా వైర‌స్‌: నాగ‌బాబు?

విచ్చిల విడి ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చైనాలో ప్రాణాంత‌క‌మైన క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. అక్క‌డి వారిని ఇత‌ర దేశాల‌కు రావివ్వ‌డం లేదు. ఇత‌ర దేశాల ప‌ర్యాట‌కుల్ని చైనాకు వెళ్ల‌నివ్వ‌కుండా క‌ట్టుద‌ట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. చైనాని ఒక విధంగా ప్ర‌పంచ దేశాలన్నీ అష్టదిగ్భంధ‌నం చేశాయి. క‌రోనా వైరస్ దెబ్బ‌తో ప్ర‌పంచ దేశాల‌న్నీ భ‌యం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటున్నాయి. ఇప్ప‌టికే 350కి మించి చ‌నిపోయార‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు కేసులు న‌మోదయ్యాయని వార్త‌లు వినిపిస్తున్నాయి.

భార‌త్‌లోనూ చైనా నుంచి వ‌స్తున్న వారిపై హెల్త్ ఎమ‌ర్జెన్సీని విధించి ప్రాప‌ర్‌గా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌రువాతే ఇండియాలోకి అడుగుపెట్ట‌నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మీడియాలో వ‌రుసగా భ‌యంక‌ర‌మైన వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మీడియాపై ఘూలుగా స్పందించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `ప‌బ్లిక్ కంటే వేగంగా క‌రోనా వైర‌స్ మీడియాని పాకుతోంద‌ని, 90 శాతం మీడియాకు క‌రోనా వైర‌స్ సోకింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మృతులు జ‌ర‌గ‌లేద‌ని, నిజంగా క‌రోనా వైర‌స్ కంట్రోల్ లోకి వ‌చ్చేసింద‌ని, అయితే క‌రొనా వైర‌స్ సోకిన మీడియా రిక‌వ‌రీ అయ్యే ఛాన్సెస్ ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. అని సోష‌ల్ మీడియా వేదిక‌గా నాగ‌బాబు పెట్టిన పోస్ట్‌పై ఇప్ప‌టికే మీడియాలో చ‌ర్చ‌మొద‌లైంది. కొంత మంది మీడియా అంటే నాగ‌బాబుకు ఎందుకంత క‌సి, క‌క్ష అని ఏకిపారేస్తున్నారు.