బంగార్రాజుకు డేట్స్ ఇచ్చిన చైతన్య

బంగార్రాజుకు డేట్స్ ఇచ్చిన చైతన్య
బంగార్రాజుకు డేట్స్ ఇచ్చిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య మొత్తానికి క్లారిటీ ఇచ్చాడు. నాగార్జున చేయబోయే బంగార్రాజు ప్రాజెక్ట్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ ఈ మధ్యనే తొలగిపోయింది. దాదాపు రెండేళ్లకు పైగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాక దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు నాగార్జున నుండి అప్రూవల్ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కనుంది.

నాగార్జున హీరోగా నటించే ఈ చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్ర పోషించనున్నాడు. చైతన్య కూడా ముందు చేస్తాడని, తర్వాత తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి కానీ చివరికి ఈ చిత్రం చేయడానికే నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం లడఖ్ లో లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో చైతన్య బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తోన్న థాంక్యూ చిత్ర బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. సో, సెప్టెంబర్ నుండి బంగార్రాజుకు డేట్స్ ఇస్తున్నాడు చైతన్య. బంగార్రాజు పూర్తి చేసిన తర్వాత తన తర్వాతి చిత్రాన్ని ప్రకటిస్తాడు.