పెళ్లి పీట‌ల‌పై నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి!


Naga chaitanya and sai pallavi on pelli peetalu
Naga chaitanya and sai pallavi on pelli peetalu

నాగాచైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. నారాయ‌ణ్ దాస్ నారంగ్, ‌పి. రామ్మోహ‌న్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఫిదా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత సాయి ప‌ల్ల‌వి, శేఖ‌ర్ క‌మ్ముల క‌ల‌యిక‌లో తెలంగాణలోని ఓ మారుమూల  గ్రామం నుంచి సిటీకి వ‌చ్చిన ఓ జంట ప్రేమ‌కథగా ఈ చిత్రాన్నిశేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు.

రొమాంటిక్ ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన తాజా పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ దీపావ‌ళి సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి పెళ్లిపీట‌ల‌పై జంట‌గా కనిపిస్తుండ‌టం ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌తో మన‌సులోని భావాల‌ని ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తం చేసుకుంటున్నారా? అనేంత‌గా ఈ ఫొటో క‌నిపిస్తోంది.

ఈ మూవీలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విల మ‌ధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో అద‌రిపోయింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌తో పాటు వ‌రుస‌గా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌లో తెలిపోయింది. దీంతో సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.