
స్టార్స్ ఈ మధ్య వెకేషన్ కోసం గోవా, మాల్దీవ్స్ వెళుతున్నారు. అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల నిహారిక, చైతన్య హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెల్లి అక్కడే ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అక్కడి దీవుల్లో సందడి చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇటీవల స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ ప్రత్యేకంగా మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్‌కి వెళ్లి ఆ ఫొటోల్ని అభిమానులతో పంచుకుంన్న విషయం తెలిసిందే.
తాజాగా స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత కూడా మల్దీవుల్లో విహరించి వచ్చారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రస్తుతం ఈ జంట గోవాకు వెళ్లింది. న్యూ ఇయర్ సంబరాల్ని అక్కడే ఈ జంట జరుపుకోబోతోంది. వీరికి సీ వ్యూ వున్న ఖరీదైన విల్లా కూడా వుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. న్యూ ఇయర్‌ని వారం పాటు అక్కడే ఎంజాయ్ చేయబోతోందీ జంట.
ఆ తరువాతే తిరిగి హైదరాబాద్ వస్తుందట. సమంత `ఫ్యామిలీమెన్ 2` సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ డ్రామా ఫిబ్రవరిలో విడుదల కానుంది. నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రంతో పాటు `లవ్‌స్టోరీ`లో నటిస్తున్నారు. గోవా నుంచి తిరిగి వచ్చాక చై `మనం` ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తారు.