క్వారెంటైర్ టైమ్ చైతూ – సామ్ ఏం చేస్తున్నారు?


క్వారెంటైర్ టైమ్ చైతూ - సామ్ ఏం చేస్తున్నారు?
క్వారెంటైర్ టైమ్ చైతూ – సామ్ ఏం చేస్తున్నారు?

క‌రోనా.. ఈ పేరు యావ‌త్ ప్ర‌పంచాన్ని, దేశాన్ని వ‌ణికిస్తోంది. వేలల్లో ప్రాణాలు ఇప్ప‌టికే గాల్లో క‌లిసిపోయాయి. పోతున్నాయి. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణమృదంగ‌మే. ఇట‌లీ లాంటి వేశాల్లో వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. అమెరికాలో మ‌ర‌ణాలు మొద‌ల‌య్యాయి. దీంతో దేశాన్నీ అప్ప‌మ‌త్త‌మ‌య్యాయి.

క‌రోనా వ్యాప్తిని త‌ట్టుకోవాలంటే సోష‌ల్ డిస్టెన్స్ ఒక్క‌టే మార్గ‌మ‌ని దేశం మొత్తం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించింది. దీంతో అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇలా ఇళ్ల‌కు ప‌రిమిత‌మైన వారు చాలా మంది త‌మ‌కు తోచిన ప‌ని చేస్తున్నారు. కొంత మంది పెయింటింట్ తో కాల‌క్షేపం చేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం వంట చేస్తున్నారు. బుక్స్ చ‌దువుతున్నారు. కొంత మంది వ‌ర్క‌వుట్‌లు చేస్తూ మ‌రోక‌రిని ఛాలెంజ్ చేస్తున్నారు.

అయితే అక్కినేని యంగ్ క‌పుల్ మాత్రం త‌మ‌కు అత్యంత ఇష్ట‌మైన పెంపుడు కుక్క‌పిల్ల హ‌ష్‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య హ‌ష్‌ని భుజంపై మోస్తున్న ఫొటోల‌తో పాటు, ఓ వీడియోని స‌మంతా తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారింది.

Credit: Twitter