మళ్ళీ నాగ చైతన్య వద్దకే బంగార్రాజు

naga chaitanya back in bangarraju project
naga chaitanya back in bangarraju project

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన మనం చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి అక్కినేని అభిమానులు చాలా సంతోషించారు. అయితే మరోసారి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తారన్న వార్తలు గత కొన్నేళ్లుగా వస్తోన్న విషయం తెల్సిందే. 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు రెండు, మూడేళ్ళుగా డిస్కషన్ మోడ్ లోనే ఉంది.

ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఇతరత్రా కారణాల వల్ల నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసాడు. నాగార్జున వేరే నటులను తీసుకుందామన్న ఆలోచన చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

ఇప్పుడు ఇక నాగ చైతన్యకు బంగార్రాజులో నటించడం తప్ప మరో ఆప్షన్ అయితే లేదు. అక్కినేని అఖిల్ ఇప్పటికే నాగార్జున 100వ సినిమాలో నటించడానికి ఎస్ చెప్పాడు కాబట్టి బంగార్రాజులో నటించడు.