స‌మంతా బ‌ర్త్‌డే స్పెష‌ల్ – భార్య‌కు ప్రేమ‌తో..స‌మంతా బ‌ర్త్‌డే స్పెష‌ల్ - భార్య‌కు ప్రేమ‌తో..
స‌మంతా బ‌ర్త్‌డే స్పెష‌ల్ – భార్య‌కు ప్రేమ‌తో..

టాలీవుడ్‌ని `ఏమాయ చేసావే` చిత్రంతో త‌న మాయ‌లో ప‌డేసిన జెస్సీ ఉరాఫ్ అక్కినేని స‌మంత పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య సోమ‌వారం అర్ధ్ర రాత్రి  జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వ‌హించారు. లాక్‌డౌన్ స‌మ‌యం కావ‌డంతో చై స్వ‌యంగా త‌న భార్య సామ్ కోసం ప్ర‌త్యేకంగా కేక్ త‌యారు చేశారు. స‌మంతా చేత కేక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల్ని, వీడియోల్ని స‌మంతా ఇన్‌స్టాలో షేర్ చేసింది.

అందులోని ఓ ఫొటోలో స‌మంతా కేక్ ముందు కూర్చుని దేవుడిని ప్రార్థిస్తూ క‌నిపించారు. సామ్ కోసం బిస్కిట్ల‌తో నాగ‌చైత‌న్య కేక్ ప్రిపేర్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లాక్డౌన్ కార‌ణంగా గ‌త కొంత కాలంగా స్టార్స్ అంతా ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. అంద‌రిలానే సామ్‌, చై కూడా ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. త‌మ‌కు న‌చ్చిన ప‌నులు చేస్తూ కాక్షేపం చేస్తున్నారు.

స‌మంతా పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్స్ అంతా శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. జ‌న్న‌దిన శుభాకాంక్ష‌లు స‌మంత నీకు ఈ ఏడాది గొప్ప‌గా వుండాల‌ని కోరుకుంటున్నా` అని వెంక‌టేష్ అన్నారు. నాకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి స‌మంత‌.. నువ్వు ఇలాగే షైన్ అవుతూ వుండు అని ర‌కుల్‌, రానా త‌దిత‌రులు స‌మంత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ట్విట్ట‌ర్‌లో స‌మంత హ్యాపీ బ‌ర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌లో వుంది.

 

View this post on Instagram

 

Family ❤️ …. (no points for guessing what I am praying for )

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Credit: Instagram