నాగ‌చైత‌న్య ఆ సినిమా చేయ‌ట్లేదా?


నాగ‌చైత‌న్య ఆ సినిమా చేయ‌ట్లేదా?
నాగ‌చైత‌న్య ఆ సినిమా చేయ‌ట్లేదా?

అక్కినేని నాగ‌చైత‌న్య‌ని హీరోగా పరిచ‌యం చేశారు దిల్ రాజు. వాసు వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ దిల్ రాజు  నిర్మించిన చిత్రం `జోష్‌`. సినిమా ఆడ‌క‌పోయినా హీరోగా నాగ‌చైత‌న్య‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. క‌థ‌, క‌థ‌నం ఆక‌ట్టుకోలేక‌పోయినా చై పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ దిల్ రాజు – నాగ‌చైత‌న్య కల‌యికలో మ‌రో సినిమా రాలేదు.

ప‌దేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేశారు. దీని కోసం బాలీవుడ్ హిట్ చిత్రం `బ‌ధాయి హో` రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. విభిన్న క‌థా చిత్రాల హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ఆయుష్‌మాన్ ఖురానా హీరోగా న‌టించిన ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో నీనా గుప్తా న‌టించింది.

అయితే ఈ రీమేక్‌లో త‌న‌కు న‌టించ‌డం ఇష్టం లేద‌ని, కావాలంటే మ‌రో క‌థ‌ని ట్రై చేద్దామ‌ని నాగ‌చైత‌న్య చెప్పార‌ట‌. దీంతో బాలీవుడ్ చిత్రం `బ‌ధాయి హో`ని రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌ను దిల్ రాజు ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలిసింది. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న `ల‌వ్‌స్టోరి` చిత్రంలో న‌టిస్తున్నాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నాగచైత‌న్య‌తో ఓ చిత్రాన్ని ప్ర‌క‌టించారు.