కరోనా క్రైసిస్ చారిటీ కు హీరో నాగచైతన్య రూ.30 లక్షల విరాళం


Naga chaitanya declared RS.30 lakhs
Naga chaitanya declared RS.30 lakhs

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు 21 రోజులు అనగా వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ పాటిస్తున్నాయి అత్యవసర సేవలు మరియు కొన్ని సర్వీసులు మినహాయించి సర్వీసులు మినహాయించి అన్ని రకాల వర్తక వాణిజ్య వ్యాపార పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఇక సినిమా పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల షూటింగ్ లు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ మరియు అన్ని రకాల ఈవెంట్లు కొంతకాలం వరకు నిలిపివేశారు.

కానీ ఇలా తాత్కాలికంగా బంద్ పాటించడం వల్ల సినిమా పరిశ్రమ పై ఆధారపడిన ఎంతోమంది రోజువారీ కార్మికుల ఉపాధికి విఘాతం కలుగుతుంది. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో “కరోనా క్రైసిస్ చారిటీ” అనే ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సినీ పరిశ్రమకు సంబంధించిన రోజువారీ కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక మంది తమ వంతు సహాయం ప్రకటిస్తున్నారు. తాజాగా యువ హీరో తాజాగా యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ విభాగానికి తనవంతు సహాయంగా 30 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సినిమా పరిశ్రమపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆధారపడిన అనేక మంది రోజువారీ కార్మికులను ఆదుకోవటానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం.