చైత‌న్య కోసం అభిమాని సాహ‌సం!

చైత‌న్య కోసం అభిమాని సాహ‌సం!
చైత‌న్య కోసం అభిమాని సాహ‌సం!

వెండితెర‌పై వెలిగే తార‌ల్ని అభిమా‌నులు డెమీ గాడ్స్‌గా భావిస్తుంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. ఒక్కోసారి అభిమానం హ‌ద్దులు దాటి ప్ర‌యోగాలు చేస్తుంటారు. కొంత మంది అలా ప్ర‌యోగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సంద‌ర్భాలూ వున్నాయి. అభిమానం హ‌ద్దులు దాటితే అన‌ర్థాల‌కు దారితీస్తుంటుంది. అలాంటి ఓ షాకింగ్ సంఘ‌ట‌న ఇటీవ‌ల `థ్యాక్యూ` షూటింగ్ లొకేష‌న్‌లో జ‌రిగింది.

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న చిత్రం `థ్యాంక్యూ`. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. చైతూ న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. ప్ర‌స్తుతం ఈ మూవీ కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ తూర్పు గోదావ‌రిలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య ఓ ప‌డ‌వ‌ని డైవ్ చేసుకుంటూ వ‌స్తున్న స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌ని చూడ‌టానికి అభిమానుల భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరారు. చైత‌న్య‌పై సీన్ చిత్రీక‌రిస్తుండ‌గా బ్రిడ్జిపై చైని చూస్తూ నీకోసం దూకేస్తున్నాన‌ని ఓ అభిమాని ఏకంగా గోదావ‌రి న‌దిలో దూకేశాడు. దీంతో కంగుతున్న యూనిట్‌, నాగ‌చైత‌న్య అత‌డిని బ‌య‌టికి తీసుకొచ్చి కొంత స‌మ‌యం అత‌నితో గ‌డిపి మ‌రోసారి ఇలాంటి పిచ్చి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని న‌చ్చ‌జెప్ప‌డంతో పాటు అత‌నితో ఫొటో కు పోజులివ్వ‌డంతో స‌ద‌రు అభిమాని సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. దీని కార‌ణంగా షూటింగ్ అంతా అప్‌సెట్ అయిపోయింది. దీంతో ప్యాక‌ప్ చెప్పేశారు.