సక్సెస్ ఫుల్ గా పది సంవత్సరాల జర్నీ పూర్తి చేసుకున్న చైతు


Naga Chaitanya
Naga Chaitanya

అక్కినేని నాగార్జున తనయుడిగా తొలి చిత్రం జోష్ తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య ఆ చిత్రం ఫెయిల్ అయినా హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. 2009 సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం నేటికీ పదేళ్లు అవుతుంది. ఈ లెక్కన నాగచైతన్య చిత్రపరిశ్రమకి వచ్చి పదేళ్లు అవుతున్నదన్నమాట.

జోష్ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంలో నటించిన చైతు ప్రేమికుడిగా అందరిమన్నలను పొందాడు. అప్పుడే సమంతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా తీసుకువచ్చింది. ఆ చిత్రం బాక్సఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

ఇక ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో చేసిన 100% లవ్ చిత్రం కూడా హిట్ అవడంతో క్లాస్ ఆడియెన్స్ కి దెగ్గరయ్యారు. ఈ రెండు హిట్స్ తో మంచి ఫామ్ లో వున్న నాగచైతన్య స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నాగచైతన్యతో సినిమాలు తీయడానికి నిర్మాతలందరూ క్యూ కట్టారు.. ఇక వరుసగా వచ్చిన దడ, బెజవాడ, తడాకా చిత్రాలు గోర పరాజయాలు కావడంతో చైతు కేరియర్ మళ్ళి కాస్త వెనకబడింది. ఆ టైములో విక్రంకుమార్ దర్శకత్వంలో నాగార్జున, చైతు కలసి మనం చిత్రంలో నటించారు.

ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవడంతో అవార్డులు రివార్డులు లభించాయి. ఈ చిత్రం చైతుకి బిగ్ బ్రేక్ ఇచ్చింది. మహానటి లో తాత నాగేశ్వరరావు గా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. మధ్యలో రెండు మూడు చిత్రాలు అపజయాలు కాగా ప్రేమమ్, శైలజారెడ్డి అల్లుడు, మజిలీ చిత్రాలు కమర్షియల్ సక్సెస్ ని సాధించాయి. ఇలా హిట్, ప్లాప్లతో తన కేరియర్ ని ముందుకు కొనసాగిస్తున్న నాగచైతన్య ఇండస్ట్రీకి వచ్చి నేటితో (సెప్టెంబర్ 5) పదేళ్లు పూర్తయ్యాయి. సమంతను ప్రేమ వివాహం చేసుకున్న ఈ యువసామ్రాట్ తన మావయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. తరువాత శేకరకమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు అక్కినేని వారసుడు చైతు. ఈయన సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కథ ఒకే చేసాడని వార్తలు వస్తున్నాయి..!!