నాగ చైతన్య ఎక్కడా తగ్గనంటున్నాడు!

Naga Chaitanya in non stop shooting mode
Naga Chaitanya in non stop shooting mode

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు రైట్ ట్రాక్ లో పడింది. 2019లో వరస హిట్స్ సాధించాడు. ఇప్పుడు వరసగా సినిమాల్లో నటిస్తూ నాగ చైతన్య ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

దాని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ ను మొదలుపెట్టాడు చైతన్య. ఇటలీలో ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయింది. నెల రోజుల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాశి ఖన్నా, చైతన్య సరసన ఈ చిత్రంలో నటించింది.

ఈ ఏడాది ఈ రెండు చిత్రాలు విడుదలవ్వడం ఖాయం. అంతే కాకుండా నాగ చైతన్య బాలీవుడ్ లో నటించబోతోన్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో చివరి 15 నిమిషాల్లో కనిపించే కీలకమైన పాత్రను చైతన్య చేస్తున్నాడు. ప్రభుత్వ అనుమతులు లభిస్తే వచ్చే నెల లఢక్ లో షూటింగ్ మొదలవుతుంది. ఈ లెక్కన నాన్ స్టాప్ షూటింగ్స్ తో చైతూ ఎక్కడా తగ్గనంటున్నాడు!