కొత్త‌గా నిర్మాణ సంస్థ‌ని స్టార్ట్ చేస్తున్నాడు?


కొత్త‌గా నిర్మాణ సంస్థ‌ని స్టార్ట్ చేస్తున్నాడు?
కొత్త‌గా నిర్మాణ సంస్థ‌ని స్టార్ట్ చేస్తున్నాడు?

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోల ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల లైన‌ప్ పెరిగిపోతోంది. నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌, బాల‌కృష్ఞ ఎన్‌బికే ఫిల్మ్స్‌, మ‌హేష్ మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్‌, నాని వాల్ పోస్ట‌ర్ సినిమా, సందీప్ కిష‌న్ వెంక‌టాద్రి టాకీస్.. ఇలా హీరోలంతా సొంత బ్యాన‌ర్‌ల‌ని సిద్ధం చేసుకుని త‌మ‌కు న‌చ్చిన క‌థ‌ల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. త‌మ అభిరుచిని చాటుకుంటున్నారు.

ఇదే కోవ‌లో మ‌రో యంగ్ హీరో కొత్త బ్యాన‌ర్‌ని స్థాపించ‌బోతున్నాడ‌ని తెలిసింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న చై `మ‌జిలీ` నుంచి త‌న పంథాను మార్చుకున్నారు. న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆయ‌న కొత్త నిర్మాణ సంస్థ‌ని స్థాపించాల‌ని, అందులో కొత్త త‌రహా చిత్రాల్ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌కు ఓ యువ ద‌ర్శ‌కుడు ఓ క‌థ‌ని వినిపించాడ‌ని, స్టోరీ కొత్త‌గా వుంది కానీ అది తాను చేసే విధంగా లేద‌ని, అందుకే తానే స్వ‌యంగా ఆ క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని చై నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అందు కోసం కొత్త‌గా నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తొలి ప్ర‌య‌త్నంగా చిన్న సినిమాని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇందులో రాజ్‌త‌రుణ్‌ని హీరోగా అనుకుంటున్నార‌ట‌. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం `ల‌వ్‌స్టోరీ` చిత్రంతో పాటు ప‌ర‌శురామ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.