లాక్ డౌన్ ను సరిగ్గా ఉపయోగించుకున్న నాగ చైతన్య


లాక్ డౌన్ ను సరిగ్గా ఉపయోగించుకున్న నాగ చైతన్య
లాక్ డౌన్ ను సరిగ్గా ఉపయోగించుకున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ ను సాఫీగానే ముందుకు తీసుకెళుతున్నాడు. గతేడాది వరసగా రెండు సినిమాలతో సూపర్ హిట్లు సాధించిన నాగ చైతన్య ఈ ఏడాది మరో రెండు సినిమాలను విడుదల చేద్దామనుకున్నాడు కానీ కరోనా వైరస్ వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం నాగ చైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. లవ్ స్టోరీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలాయె అవకాశాలు ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య వరస సినిమాలతో హల్చల్ చేస్తున్నాడు. లవ్ స్టోరీ కాకుండా నాగ చైతన్య వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా.

నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో మరో సినిమాను సెట్ చేసుకున్నాడు.

ఈ మూడు సినిమాలను కూడా వచ్చే ఏడాది పూర్తి చేయాలనుకుంటున్నాడు నాగ చైతన్య.