మ‌హేష్‌ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా చై?


యంగ్ హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్త‌యింది. త్వ‌ర‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత నాగ‌చైత‌న్య `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `థ్యాంక్యూ` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. విభిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాల్ని తెర‌కెక్కించే విక్ర‌మ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని కూడా ఓ స‌రికొత్త క‌థ‌తో చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. అబిడ్స్‌లోని రామ‌కృష్ణ థియేట‌ర్‌లో చైత‌న్య పాల్గొన‌గా కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య స్టార్ హీరో మ‌హేష్‌బాబు ఫ్యాన్‌గా న‌టిస్తున్నార‌ట‌. పాత్ర పేరు అభిరామ్ అని తెలిసింది.

మ‌హేష్‌బాబు అభిమాన సంఘానికి నాగ‌చైత‌న్య ప్రెసిడెంట్‌గా ఈ చిత్రంలో క‌నిపిస్తార‌ని ఇన్ సైడ్ టాక్‌. బీవీఎస్ ర‌వి క‌థ అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే చిత్ర బృందం వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.