నాగచైతన్య మిస్ చేసుకున్న హిట్


nagachaitanya missed golden chanceఇటీవల విడుదలైన సమ్మోహనం చిత్రం మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటున్న సినిమా సమ్మోహనం కాగా అలాంటి సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య . దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయాలనీ భావించాడు . చైతూ దగ్గరకు వెళ్లి ఓ మూడు కథలు కూడా చెప్పాడట !

అలా ఇంద్రగంటి చైతూ కి చెప్పిన మూడు కథల్లో ఈ సమ్మోహనం కూడా ఉందట ! అయితే కథ ఫుల్ నెరేట్ చేయకపోవడం కావచ్చు , లేకపోతే నాగచైతన్య కు ఆ సినిమా కథ నచ్చకపోవడం కావచ్చు మొత్తానికి ఆ ప్రాజెక్ట్ సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళింది . ఇంద్రగంటి చెప్పిన కథ సుధీర్ బాబు కు నచ్చడం వెంటనే ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి ఇంకేముంది సినిమా సెట్స్ పైకి వచ్చింది కట్ చేస్తే సూపర్ హిట్ కొట్టేసింది . నాగచైతన్య సరిగ్గా స్పందించకపోవడం వల్ల సమ్మోహనం లాంటి సూపర్ హిట్ ని మిస్ చేసుకున్నాడు . అయితే భవిష్యత్ లో తప్పకుండా నాగచైతన్య తో సినిమా చేస్తానని అంటున్నాడు మోహనకృష్ణ ఇంద్రగంటి .