నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా?



నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా?
నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

ప్రస్తుతం నాగ చైతన్య బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడని చెప్పవచ్చు. తన లాస్ట్ సినిమా మజిలీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో సమంత తన భార్యగా నటించడం తన ఆనందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య తన లేటెస్ట్ సినిమా వెంకీ మామతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఇందులో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. వెంకీ మామ చిత్రాన్ని మొదట సంక్రాంతికి విడుదల చేద్దామని భావించినా తర్వాత డిసెంబర్ 13కి మార్చారు. ఆ రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం. వెంకటేష్ రైతు పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. వెంకీ మామ షూటింగ్ లో ఉండగానే నాగ చైతన్య తన తర్వాతి సినిమాను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. షూటింగ్ మొత్తాన్ని త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ లేదా మార్చ్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు.

ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో నాగ చైతన్య ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు టైటిల్ ను ఇంకా నిర్ధారించలేదు. లవ్ స్టోరీ అనే టైటిల్ ను పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇది ఇంకా అధికారికమో కాదో ఇంకా తెలియలేదు. ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి.