ఆగ‌స్టు నుంచి రెడీ అంటున్నాడు!


ఆగ‌స్టు నుంచి రెడీ అంటున్నాడు!
ఆగ‌స్టు నుంచి రెడీ అంటున్నాడు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా చాలా సినిమాల షూటింగ్స్ మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. కొన్ని 80 శాతం, కొన్ని 70 శాతం చిత్రాక‌ర‌ణ పూర్తి చేసుకుని మిగ‌తా భాగం షూటింగ్‌ని త్వ‌ర‌గా పూర్తి చేసి చిత్రాల్ని నిర్మాత‌లు స‌మ్మ‌ర్‌కు లేదా ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. క‌రోనాతో వారి ప్లాన్ మారిపోయింది. షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేట‌ర్లు తెర‌వ‌డం క‌ష్టంగా మారింది.

ఈ నేప‌థ్యంలో కొంత మంది బ్యాలెన్స్‌గా వున్న భాగాన్ని పూర్తి చేసి సినిమాని రెడీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాంగా నాగ‌చైత‌న్య న‌టిస్తున్న `ల‌వ్‌స్టోరీ`షూటింగ్ వ‌చ్చే నెల ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 20 శాతం మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది.

బ్యాలెన్స్ షూటింగ్‌ని వ‌చ్చే నెల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించి ఫినిష్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి నాగ‌చైత‌న్య కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ముందు ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆ ప్లాన్ మారిపోయింది. ఇప్పుడు ద‌స‌రాకు సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. అదీ థియేట‌ర్స్ రీఓపెన్ అయితేనే లేదంటే సంక్రాంతికి త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదు.