ప్రేమికుల రోజున పలకరించనున్న నాగ చైతన్య, సాయి పల్లవి


ప్రేమికుల రోజున పలకరించనున్న నాగ చైతన్య, సాయి పల్లవి
ప్రేమికుల రోజున పలకరించనున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శేఖర్ కమ్ముల వరస ప్లాపుల నుండి గతేడాది ఫిదాతో సూపర్ బ్లాక్ బస్టర్ సాధించాడు.

అందులో సాయి పల్లవి క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. అందుకే మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండడంతో అంచనాలు బాగున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 14 శుక్రవారం రావడంతో, తమ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఈ డేట్ అయితే పెర్ఫెక్ట్ అన్నది శేఖర్ కమ్ముల భావన.

నాగ చైతన్య నటించిన మరో సినిమా వెంకీ మామ ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. వెంకటేష్ మరో లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని వెంకీ మామ డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు సన్నద్ధమవుతోంది.