శేఖర్ కమ్ముల ఏంటి ఇంత స్పీడుమీదున్నాడు?


naga chaitanya sai pallavi sekhar kammula film wraps up first schedule
శేఖర్ కమ్ముల ఏంటి ఇంత స్పీడుమీదున్నాడు?

సెన్సిబుల్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఒక చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలవ్వగా, అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందిట. జెట్ స్పీడుతో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల.

అన్నీ అనుకున్నట్లు జరిగితే క్రిస్మస్ బరిలోకి, లేదంటే సంక్రాంతి పోటీలోకి ఈ చిత్రాన్ని దింపాలని ఆలోచిస్తున్నారు. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి రానున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.