`క‌ప‌ట‌ధారి` : ఎంగేజింగ్ అండ్ ప్రామిసింగ్‌


`క‌ప‌ట‌ధారి` : ఎంగేజింగ్ అండ్ ప్రామిసింగ్‌
`క‌ప‌ట‌ధారి` : ఎంగేజింగ్ అండ్ ప్రామిసింగ్‌

మ‌ళ్లీరావా, సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్ వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నారు హీరో సుమంత్‌. సెలెక్టీవ్‌గా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌స్తున్న ఆయ‌న తాజాగా మ‌రో విభిన్న‌మైన థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `క‌ప‌ట‌ధారి`లో న‌టిస్తున్నారు. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన `క‌వ‌లుధారి` చిత్రానికిది రీమేక్‌. క్రియేటీవ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అండ్ డిస్ట్రీబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మాత డా. ధ‌నుంజ‌య‌న్ నిర్మిస్తున్నారు.

త‌మిళంలో స‌త్య‌రాజ్ త‌న‌యుడు శిబిరాజ్ హీరోగా న‌టిస్తుండ‌గా తెలుగులో సుమంత్ న‌టిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో నాగార్జున‌, స‌మంత సంయుక్తంగా రిలీజ్ చేశారు. మెట్రో లైన్ త‌వ్వ‌కాల్లో కొన్ని అస్థిపంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ శ‌వాలను పాతిపెట్టి ఎంత కాలం అయ్యుంటుంది..? ట‌్రాఫిక్ ఎస్సైవా..అదొక క్లోజ్డ్ కేస్‌. చ‌నిపోయిన వ్య‌క్తి పేరు సంప‌త్‌రాజ్‌.. దీన్ని చూస్తే స్టేట్మెంట్ ఇచ్చిన వారిలో ఎవ‌రో ఒక‌రు అబ‌ద్ధం చెప్పారు. క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్  పోలీసే.. అంటూ ట్రైల‌ర్‌లో వినిపిస్తున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

మెట్రో లైన్ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన  అస్థిపంజ‌రాల ఆధారంగా స‌ద‌రు హ‌త్య‌ల వెన‌క ఏం జ‌రిగింది? ఎవ‌రున్నార‌ని ఓ ట్రాఫిక్ ఎస్సై శోధించ‌డం మొద‌లుపెడ‌తాడు.. ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? వ‌ఆటిని అత‌ను ఎలా అధిగ‌మించాడ‌న్న‌దే `క‌ప‌ట‌ధారి` ప్ర‌ధాన క‌థ‌. క‌థ‌, క‌థ‌నం, విజువ‌ల్స్ తో ఓవ‌రాల్‌గా `క‌ప‌ట‌ధారి` ట్రైల‌ర్ ఎంగేజింగ్ అండ్ ప్రామిసింగ్‌గా వుంది.