వెంకీ మామ.. చైతూ క్లారిటీ ఇచ్చేసాడు



వెంకీ మామ.. చైతూ క్లారిటీ ఇచ్చేసాడు
వెంకీ మామ.. చైతూ క్లారిటీ ఇచ్చేసాడు

వెంకీ మామ సినిమాలో ముందు నుండీ ఉన్న అనుమానమే నిజమైంది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరో కాదట. జస్ట్ వెంకటేష్ కి సపోర్ట్ లాగ ఉంటుందిట. ఈ విషయాన్ని ఎవరో చెబితే ఎవరైనా ఎందుకు నమ్ముతారు. స్వయంగా నాగ చైతన్యనే చెప్పడం ఇక్కడి విశేషం. ముందు నుండీ వెంకీ మామ విషయంలో అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఇదే అనుమానిస్తూ వచ్చారు. ఎందుకంటే టైటిల్ కూడా వెంకటేష్ పైనే పెట్టారు. అటు ట్రైలర్, ప్రోమోలు ఏది చూసినా వెంకటేష్ క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యేలా చూసారు. కావాలని ఇలా చేసారా లేక నాగ చైతన్య పాత్రకు తక్కువ ఇంపార్టెన్స్ ఉందా అన్నది అప్పుడు అర్ధం కాలేదు. పైగా వెంకీ క్యారెక్టర్ ను అటు ఎంటర్టైనింగ్ గాను, ఇటు ఎమోషనల్ గానూ ఉండేలా తీర్చిదిద్దారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తే ఇది అసలు మల్టీ స్టారరేనా అన్న సందేహం కలిగింది సామాన్యు ప్రేక్షకుడికి.

ఇదే విషయాన్ని నాగ చైతన్యతో ఇంటర్వ్యూలో మరో రకంగా అడిగారు మీడియా వాళ్ళు. ఈ మల్టీ స్టారర్ ను ఏ విధంగా చూస్తున్నారు? మీరు చేసిన మల్టీ స్టారర్స్ లో ఇదే బెస్ట్ అని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దానికి చైతూ వెంకీ మామ అనేది మల్టీ స్టారర్ కాదని, వెంకటేష్ కు సపోర్టింగ్ క్యారెక్టర్ లాంటిదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే నాగ చైతన్య ఇలా చెప్పడానికి రెండు కారణాలు ఉండొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి నిజంగానే చైతూ క్యారెక్టర్ కు అంత స్కోప్ ఇవ్వలేదేమో. రెండోది కావాలనే చైతూ ఆలా చెప్పి ఉండవచ్చు. వెంకటేష్ కు హైప్ ఇవ్వడానికి అలా చెప్పి ఉండవచ్చు. ఏదేమైనా వెంకీ మామలో ముందు వెంకటేష్ హైలైట్ అవుతున్నాడన్నది నిజం. అతన్ని చూసే ముందు టికెట్ తెగేది. అయినా ఇంత డిస్కషన్ కూడా ఎందుకు మరో 24 గంటల్లో అసలు విషయం తేలిపోతుందిగా.

వెంకీ మామపై ప్రస్తుతం బిజినెస్ సర్కిల్స్ లో చాలా అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత ఒక పేరున్న చిత్రం విడుదల కానుండడంతో అటు ట్రేడ్, ఇటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా బాగుందన్న టాక్ వస్తే చాలు, ఇక ఈ సినిమాను ఆపడం ఎవరి వల్లా కాదు. పైగా థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవడానికి నిర్మాత సురేష్ బాబు ఉండనే ఉన్నాడు. చూద్దాం వెంకీ మామ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.